Rhea Chakraborthy: హీరోయిన్ రియా చక్రవర్తికి బిగుస్తున్న ఉచ్చు.. కేసు నమోదు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో!
![Narcotics Control Bureau registers a case against Rhea Chakraborty](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-18468144c75b.jpg)
- డ్రగ్స్ డీలర్ తో రియా వాట్సాప్ చాటింగ్
- చాట్ ను ఫోన్ నుంచి తొలగించిన రియా
- డ్రగ్స్ మాఫియాతో సంబంధాలను నిర్ధారించిన నార్కోటిక్స్ బ్యూరో
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అతని మాజీ ప్రియురాలు, హీరోయిన్ రియా చక్రవర్తిపై కేసులు నమోదైన సంగతి తెలిపిందే. సీబీఐ సైతం ఈ కేసును విచారిస్తోంది.
ఈ నేపథ్యంలో, డ్రగ్ డీలర్ గౌరవ్ ఆర్యతో రియా వాట్సాప్ చాటింగ్ చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చాట్ ను తన ఫోన్ నుంచి రియా తొలగించినా... అధికారులు దాన్ని తిరిగి పొందారు. రియాకు, డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఉన్నాయని నిర్ధారించుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది.