Nani: ఆద్యంతం ఉత్కంఠ‌భరితంగా 'వీ' ట్రైలర్.. విడుదల చేసిన నాని!

V Trailer for you

  • నాని, సుధీర్‌బాబు కలిసి నటించిన ‘వీ’ సినిమా
  • అదుర్స్ అనిపిస్తోన్న నాని డైలాగులు
  • సినిమాపై అంచనాలను పెంచేస్తున్న ట్రైలర్
  • సెప్టెంబరు 5న అమెజాన్‌లో విడుదల 

నేచురల్ స్టార్ నాని, యంగ్ స్టార్ సుధీర్‌బాబు కలిసి నటిస్తున్న ‘వీ’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠ‌భరితంగా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'ఎలా ఫినిష్ చేద్దాం' అంటూ ఈ సినిమాలో ఉన్న ఓ డైలాగుని గుర్తు చేస్తూ నాని తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని విడుదల చేశాడు.

ఇందులో నివేదా థామస్‌, అదితీరావు హైదరి హీరోయిన్లుగా నటించారు. ఇందులో జగపతిబాబు, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో వచ్చేనెల‌ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇందులో సుధీర్‌బాబు పోలీసుగా నటిస్తున్నాడు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందించారు. దిల్‌ రాజు బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

                      

Nani
Tollywood
trailer
  • Error fetching data: Network response was not ok

More Telugu News