brazil: జర్నలిస్టుని కొడతానంటూ.. ఆగ్రహంతో ఊగిపోయిన బ్రెజిల్ అధ్యక్షుడు

brazil president fires on journalist

  • తాజాగా మీడియాతో మాట్లాడిన బోల్సొనారో 
  • భార్య మిచెల్లిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఓ విలేకరి ప్రశ్న
  • మూతి పగులకొడతానంటూ బోల్సొనారో ఆగ్రహం

మీడియాపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో తీవ్రంగా విరుచుకుపడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా బోల్సొనారో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా... ఆయన భార్య మిచెల్లి బోల్సోనారోపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఓ విలేకరి ప్రశ్నించారు.

దీంతో ఇటువంటివి అడిగితే మూతి పగులకొడతానంటూ బోల్సొనారో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడుతూ జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలకు దిగారు. వారి నిరసనను పట్టించుకోకుండా బోల్సొనారో అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ నేతగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బోల్సొనారో తన బాధ్యతలను విస్మరించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడమేంటని అక్కడి మీడియా కథనాలను ప్రచురించింది.
   
కాగా, 2019 జనవరిలో జైర్ బోల్సొనారో అధ్యక్షుడయ్యే ముందు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో జైర్ బోల్సొనారో తన భార్య ఖాతాలో అక్రమంగా డబ్బు వేశారని ఆరోపణలు ఉన్నాయి.

brazil
journalist
  • Loading...

More Telugu News