KAPaul: బాలూను బతికించాలని ఫోన్లు చేస్తున్నారు... ప్రార్థిస్తున్నా: కేఏ పాల్ 

KA Paul Says He is Praying for SPB

  • ఎంతో మంది కోరిక మేరకు ప్రార్థనలు
  • జీసస్ ఆయన్ను బతికిస్తారు
  • ఓ వీడియోలో పేర్కొన్న కేఏ పాల్

క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. కరోనా సోకి, చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణాలను కాపాడాలని తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తాను ఆయన ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నానని చెప్పారు. లార్డ్ జీసెస్, తప్పకుండా ఆయన్ను తిరిగి బతికిస్తారని చెప్పారు. గతంలో ప్రాణాలు కాపాడిన వారి వివరాలను చెబుతూ, ఇప్పుడు తన ప్రార్థనలతో ఎస్పీబీ సైతం బయటపడతారని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. కాగా, ప్రస్తుతం ఎస్పీబీ ఆసుపత్రిలో వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్ పై చికిత్స పొందుతూ ప్రాణాల కోసం పోరాడుతున్నారు.

KAPaul
SP Balasubrahmanyam
Preyer
  • Error fetching data: Network response was not ok

More Telugu News