Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Thamanna latest film shoot begins from next month
  • వచ్చే నెల నుంచి తమన్నా షూటింగ్ 
  • 'వకీల్ సాబ్' కోసం ఆర్.ఎఫ్.సి.లో సెట్స్   
  • ఓ ఇంటివాడు కానున్న శర్వానంద్ 
  • 'రొమాంటిక్' కోసం అన్నపూర్ణలో సెట్స్  
*  తమన్నా, సత్యదేవ్ జంటగా 'గుర్తుందా శీతాకాలం' పేరిట ఓ రొమాంటిక్ ఫిలిం రూపొందుతోంది. కన్నడలో వచ్చిన 'లవ్ మాక్ టైల్' సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగును ఈ నెల 27న లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. రెగ్యులర్ షూటింగును వచ్చే నెల మూడో వారం నుంచి నిర్వహిస్తారు. దీనికి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం షూటింగును నవంబర్ నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో సెట్ కూడా వేస్తున్నారట.
*  టాలీవుడ్ లోని యంగ్ హీరోలు ఒక్కొక్కరు ఇటీవల పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారవుతున్నారు. నిఖిల్, నితిన్, రానా దగ్గుబాటి ఇటీవల అలా పెళ్లిళ్లు చేసుకుని బ్యాచిలర్ జీవితానికి బై చెప్పారు. ఈ కోవలో మరో హీరో శర్వానంద్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
*  ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా రూపొందుతున్న 'రొమాంటిక్' చిత్రానికి సంబంధించి మిగిలివున్న షూటింగును త్వరలో హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్ వేస్తున్నట్టు, ఇందులో క్లైమాక్స్ దృశ్యాలతో పాటు కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నట్టు సమాచారం.  
Thamanna
Pawan Kalyan
Sharwanand
Akash Puri

More Telugu News