Shootings: దేశంలో సినీ, టీవీ షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Centre gives nod for Cinema and TV Shootings

  • కరోనా భయంతో నిలిచిన షూటింగులు
  • జాగ్రత్తలు తీసుకోవాలన్న కేంద్రం
  • థియేటర్లలో భౌతికదూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు

కరోనా దెబ్బకు స్తంభించిపోయిన సినీ, టీవీ రంగాలకు ఊరటనిచ్చేలా కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. లాక్ డౌన్ అనంతరం షూటింగులు ప్రారంభమైనా కరోనా కేసులు వస్తుండడంతో అవి నిలిచిపోయాయి. తాజాగా అన్ లాక్-3లో భాగంగా కేంద్రం సినీ, టీవీ షూటింగులకు అనుమతి ఇచ్చింది. అయితే, అనేక నిబంధనలను విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ ప్రకటన చేశారు. కెమెరా ముందు ఉండే నటీనటులు తప్ప మిగతా వాళ్లందరూ మాస్కులు వేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

  • నటీనటులందరూ ఆరోగ్యసేతు యాప్ ఉపయోగించాలి.
  • అవుట్ డోర్ షూటింగుల్లో యూనిట్ సభ్యులందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
  • సాధ్యమైనంత తక్కువ సిబ్బందితో షూటింగ్ జరుపుకోవాలి.
  • షూటింగ్ స్పాట్ లో సిబ్బంది తప్పకుండా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.
  • లొకేషన్ లో తాత్కాలిక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి.
  • నటీనటులతో సన్నిహితంగా ఉండాల్సిన మేకప్ సిబ్బంది తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలి.
  • షూటింగ్ సమయాల్లో విజిటర్లను అనుమతించరాదు.
  • థియేటర్లలో భౌతికదూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాలి.
  • టికెట్లు ఆన్ లైన్ లో మాత్రమే విక్రయించాలి.

  • Loading...

More Telugu News