Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం... 100 మంది దక్షిణాది సినీతారలు షేర్ చేసిన డీపీ!

Above 100 South Celebrities Shared Chiranjeevi DP

  • నిన్న చిరంజీవి 65వ పుట్టిన రోజు
  • కామన్ డీపీని విడుదల చేసిన రామ్ చరణ్
  • ఎంతో మంది షేర్ చేయడంతో వైరల్

నిన్న శనివారం మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టిన రోజును జరుపుకోగా, దక్షిణాది సినీ తారలు ఆయనకు ఓ అరుదైన గౌరవాన్ని ఇచ్చారు. తన తండ్రి వివిధ చిత్రాల్లో వేసిన పాత్రలతో కూడిన ఓ కామన్ డిస్ ప్లే పిక్చర్ ను రామ్ చరణ్ ఆవిష్కరించగా, ఆ పోస్టర్ ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన సూపర్ స్టార్లు, నటీనటులు, దర్శకులు ఎంతో మంది షేర్ చేసుకున్నారు. దీనికి 'హెచ్బీడీ మెగాస్టార్ చిరంజీవి' అనే హ్యాష్ ట్యాగ్ ను తగిలించడంతో అది కూడా వైరల్ అయింది.


ఇక ఈ చిత్రంలో చిరంజీవి నటించిన పలు హిట్ చిత్రాల స్టిల్స్ కనిపిస్తున్నాయి. ఖైదీ, పసివాడి ప్రాణం, స్వయంకృషి, ఘరానా మొగుడు, ఇంద్ర, ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాల స్టిల్స్ తో దీన్ని తయారు చేశారు. 

కాగా, కరోనా సమయంలో పనిలేక తీవ్రంగా నష్టపోయిన తెలుగు సినీ కళాకారులను ఆదుకునేందుకు కరోనా క్రైసెస్ చారిటీ పేరిట ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన మెగా ఫ్యామిలీ, ఈ ఆరు నెలల కాలంలో పలుమార్లు కార్మికులకు నిత్యావసరాలను అందించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 152వ చిత్రం 'ఆచార్య' టైటిల్ మోషన్ పోస్ట్ ను విడుదల చేయగా, అది కూడా వైరల్ అయింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News