Coimbattore: కోయంబత్తూరు లాడ్జిలో నిలువెత్తు అద్దం... అనుమానంతో పరిశీలించిన పోలీసులు అవాక్కు!
- శరణ్యా లాడ్జిలో సెక్స్ రాకెట్
- అద్దాల వెనుక రహస్య గదులు
- ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ లాడ్జిలో తనిఖీలకు వెళ్లిన పోలీసులు, అద్దాల వెనుక ఏర్పాటు చేసిన రహస్య గదుల్లో వ్యభిచారం జరుగుతుండటాన్ని చూసి అవాక్కయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడున్న శరణ్యా లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పోలీసులు తనిఖీలకు వెళ్లారు. అన్ని గదులను వెతికినా అనుమానించతగ్గ వారు ఎవరూ కనిపించలేదు. ఓ గదిలో మాత్రం వారికి రెండు పెద్ద పెద్ద అద్దాలు కనిపించాయి. ఆ లాడ్జిలో రెండు పెద్ద అద్దాలు ఉండటం, అవి ఎదురెదురుగా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. ఓ అద్దాన్ని కదిలించగా దాని వెనుక రహస్యంగా ఏర్పాటు చేసిన ఓ గదే ఉంది. దానిలో బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి ఉంది. ఇద్దరు వ్యక్తులు ఆమెను తీసుకుని వచ్చి, దందా జరిపిస్తున్నారని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు