Bandi Sanjay: సీఎం ఆదేశాలతో పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్

BJP Telangana chief Bandi Sanjay Fires on KCR Govt
  • కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఉత్సవాలు
  • మండపాల వద్ద పోలీసుల అత్యుత్సాహం
  • పూజలకు వెళ్లే అర్చకులను కూడా వేధిస్తున్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో పోలీసులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంతోపాటు తన కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా నిన్న ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజలంతా సంతోషంగా గణపతి ఉత్సవాలు జరుపుకుంటుంటే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు జరుపుకుంటామని చెబుతున్నా పోలీసుల ద్వారా ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. గణేశ్ మండపాల వద్ద పోలీసులు వేధింపులకు దిగుతున్నారని, పూజల కోసం వెళ్లే అర్చకులను కూడా అడ్డుకుంటున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను అడ్డుకునే రోజులు త్వరలోనే వస్తాయని హెచ్చరించారు.
Bandi Sanjay
Telangana
BJP
KCR
Ganesh Chavithi

More Telugu News