Indian Americans: జో బైడెన్-కమలా హారిస్ జోడీ గెలుపు కోసం ముందుకు కదిలిన అమెరికన్ భారతీయ సమాజం
- అమెరికా ఉపాధ్యక్ష పదవి బరిలో కమలా హారిస్
- భారతీయ సమాజం ఓట్లపై గురిపెట్టిన జో బైడెన్
- సంగీతభరిత వీడియోతో ప్రచారం చేస్తున్న భుటోరియా దంపతులు
కరోనా మహమ్మారి కలవర పెడుతున్న తరుణంలోనూ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం యమా రంజుగా సాగుతోంది. అమెరికాలో అత్యధిక సంఖ్యలో ఉన్న భారతీయులను ఆకట్టుకునేందుకు డెమొక్రాట్లు ఉపాధ్యక్ష పదవి అభ్యర్థికి కమలా హారిస్ ను బరిలో దింపారు. భారతీయ మూలాలున్న కమలా హారిస్ తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బైడెన్ బలంగా నమ్ముతున్నారు. ఆయన అంచనాలు సరైనవేనని అమెరికాలోని భారతీయ సమాజం స్పందిస్తున్న తీరు చెబుతోంది.
వినీతా భుటోరియా, అజయ్ భుటోరియా అనే దంపతులు కమలా హారిస్-జో బైడెన్ జోడీని భారతీయ అమెరికన్లు గెలిపించాలంటూ ఓ సంగీత భరితమైన వీడియోతో ప్రచారం చేస్తున్నారు. ఏది సరైనదో అది సాధించుకునేందుకు అమెరికన్ భారతీయ సమాజం అంతా కదిలిరావాలని వినీతా భుటోరియా పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు అంటే ఎలా ఉండాలి... జో బైడెన్ లా ఉండాలి అంటూ తమదైన శైలిలో ఆ జంట ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తోంది.