Nithin: నితిన్ 'రంగ్ దే' సినిమా కూడా ఆన్ లైన్ విడుదలేనా?

Nitin Rangde film to be ready for online release
  • నాని 'వి' అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల 
  • నితిన్ హీరోగా రూపొందుతున్న 'రంగ్ దే'
  •  విడుదలకి సిద్ధం చేస్తున్న నిర్మాతలు  
కరోనా దెబ్బకి థియేటర్లు మూతబడడం.. ఇక ఇప్పట్లో వాటిని తెరిచే సూచనలు కనపడకపోవడం.. ఒకవేళ తెరిచినా ప్రేక్షకులు వస్తారా? రారా? అన్న మీమాంశలుండడం.. ఈ నేపథ్యంలో పూర్తయిన తమ చిత్రాలను ఇప్పటికే కొందరు ఓటీటీ ప్లాట్ ఫారంలకి ఇచ్చేస్తున్నారు. ఎటొచ్చీ స్టార్ హీరోలు మాత్రం తమ చిత్రాలను డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా రిలీజ్ చేయడానికి ఇష్టపడడం లేదు.

అయితే, హీరో నాని నటించిన 'వి' చిత్రం ఓటీటీ ద్వారా విడుదల కానుందంటూ అధికారికంగా వచ్చిన వార్త సంచలనమైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. దీంతో మరికొందరు హీరోలు ఈ మార్గాన్ని అనుసరిస్తూ.. తమ సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట.

ఈ కోవలోనే నితిన్ నటిస్తున్న 'రంగ్ దే' చిత్రం కూడా ఓటీటీ ద్వారా విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో పూర్తికానుంది. దీంతో థియేటర్ల కోసం ఎదురుచూడకుండా ఆన్ లైన్ విడుదలకైనా సరే నిర్మాతలు సిద్ధపడుతున్నట్టు సమాచారం.    
Nithin
Keerti Suresh
Nani
Amezon

More Telugu News