Kangana Ranaut: అమీర్ ఖాన్ ను టార్గెట్ చేసిన కంగనా రనౌత్

Kangana Ranaut fires on Kangana Ranaut
  • సుశాంత్ మరణంపై అమీర్ సంతాపాన్ని ప్రకటించలేదు
  • టర్కీ అధ్యక్షుడి భార్య నుంచి ఆతిథ్యం అందుకున్నాడు
  • అమీర్ తో కలసి సుశాంత్ నటించాడు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలోని బంధుప్రీతిపై హీరోయిన్ కంగనా రనౌత్ ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పలువురు సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. తాజాగా స్టార్ హీరో అమీర్ ఖాన్ ను ఆమె టార్గెట్ చేశారు.

సుశాంత్ మరణించి ఇన్ని రోజులు గడిచినా అమీర్ ఖాన్ ఎందుకు సంతాపాన్ని ప్రకటించలేదని ఆమె ప్రశ్నించారు. 'పీకే' సినిమాలో అమీర్ తో కలసి సుశాంత్ నటించాడని చెప్పారు. అమీర్ ఏమీ మాట్లాడకపోతే... అనుష్క శర్మ, రాజు హిరానీ, ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీ వీరంతా కూడా ఏమీ మాట్లాడరని అన్నారు. ఈ రాకెట్ ఒక ముఠాలా పని చేస్తుంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తోటి నటుడు చనిపోతే స్పందించని అమీర్ ఖాన్... టర్కీలో షూటింగ్ సందర్భంగా అక్కడి అధ్యక్షుడి భార్య నుంచి ఆతిథ్యం అందుకున్నాడని విమర్శించారు.
Kangana Ranaut
Aamir Khan
Sushant Singh Rajput
Bollywood

More Telugu News