Chiranjeevi: ఇది నా జీవితంలో లభించిన మహత్తరమైన అదృష్టం: చిరంజీవి
- నేడు చిరంజీవి 65వ పుట్టినరోజు
- శుభాకాంక్షలు తెలిపినవారికి కృతజ్ఞతలు అంటూ చిరు ట్వీట్
- ఈ ప్రేమ తన జీవితాన్ని మలిచిందంటూ వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి నేడు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు. "అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు. నా పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమతో నా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతోంది. ఈ ప్రేమే నా జీవితాన్ని తీర్చిదిద్దింది. ఈ ప్రేమే నా జీవితంలో లభించిన మహత్తరమైన అదృష్టంగా భావిస్తాను. మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ పేర్కొన్నారు.