Khel Ratna: రోహిత్ శర్మ, వినేశ్ ఫోగాట్ లకు ఖేల్ రత్న... తెలుగుతేజం సాయిరాజ్ కు అర్జున అవార్డు

Centre announced prestigious sports awards

  • క్రీడా అవార్డులు ప్రకటించిన కేంద్రం
  • మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ కు ఖేల్ రత్న
  • ఇషాంత్ శర్మకు అర్జున అవార్డు

కేంద్రం ప్రతిష్ఠాత్మక క్రీడా అవార్డులను ప్రకటించింది. ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య తదితర కేటగిరీల్లో విజేతలతో కూడిన జాబితాను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారంగా భావించే రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఈ ఏడాది క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లింగ్ క్రీడాకారిణి వినేశ్ ఫోగాట్, భారత హాకీ మహిళల జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలు ఎంపికయ్యారు.

ఇక మరో విశిష్ట పురస్కారం అర్జున అవార్డు విజేతల్లో తెలుగుతేజం, బ్యాడ్మింటన్ ఆశాకిరణం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కూడా ఉన్నాడు. సాత్విక్ సాయిరాజ్ డబుల్స్ లో ప్రపంచస్థాయిలో పదో ర్యాంకులో ఉండడం విశేషం. అర్జున గెలుచుకున్నవారిలో విలువిద్య క్రీడాకారుడు అతాను దాస్, మహిళా అథ్లెట్ ద్యుతీచంద్, క్రికెటర్ ఇషాంత్ శర్మ, మహిళా క్రికెటర్ దీప్తి శర్మ తదితరులు ఉన్నారు.

Khel Ratna
Arjuna
Rohit Sharma
Vinesh Phogat
Awards
Sports
  • Loading...

More Telugu News