Mopidevi Venkataramana: రోడ్డు పక్కన ఆపివున్న వాహనాన్ని ఢీకొన్న మోపిదేవి కారు

MP Mopidevi Venkataramana escapes from accident

  • విజయవాడ నుంచి విశాఖ వెళుతుండగా ఘటన
  • విశాఖ చేరువలో ప్రమాదం
  • డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కారులో వెళ్లిన మోపిదేవి

వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తమ కాన్వాయ్ లతో విజయవాడ నుంచి విశాఖ వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. మరికొద్దిసేపట్లో విశాఖ చేరుకుంటారనగా, మోపిదేవి ప్రయాణిస్తున్న కారు తాళ్లపాలెం జంక్షన్ వద్ద ఆగివున్న మరో కారును ఢీకొట్టింది. రోడ్డుపై స్టాప్ బోర్డులు అడ్డుగా ఉండడంతో మోపిదేవి వాహనం అదుపుతప్పింది. కాగా, మోపిదేవి ప్రయాణిస్తున్న వాహనం దెబ్బతినడంతో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తన కారును ఆపి మోపిదేవిని పరామర్శించారు. ఆపై మోపిదేవిని తన కారులో ఎక్కించుకున్నారు. మోపిదేవికి ప్రమాదం తప్పడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Mopidevi Venkataramana
Accident
Pushpasreevani Pamula
Visakha
YSRCP
Rajya Sabha
  • Loading...

More Telugu News