Ranjan Gogoi: సుప్రీం మాజీ చీఫ్ జస్టిర్ గొగోయ్ పై పిటిషన్.. కొట్టేసిన సుప్రీంకోర్టు!

Supreme court dismissed petition againg ex CJI Ranjan Gogoi

  • 2018 లో గొగోయ్ పై పిటిషన్
  • అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణ
  • పిటిషన్ ను విచారించడం వల్ల ఉపయోగం లేదన్న ధర్మాసనం

సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. సీజేఐగా ఉన్నప్పుడు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయనపై 2018లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.

 రెండేళ్ల క్రితం తాను పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దాన్ని ఇంత వరకు ధర్మాసనం ముందుకు పెట్టలేదని తాజాగా పిటిషనర్ ఆరోపించారు. పలు మార్లు రిజిస్ట్రీకి లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు. 2018లో గొగోయ్ ప్రతివాదులకు తెలియకుండా అక్రమంగా తీర్పును వెలువరించారని... దీనిపై అంతర్గత కమిటీ వేసి విచారణ చేపట్టాలని కోరారు.

ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గొగోయ్ పదవీ విరమణ చేసినందున విచారణ చేపట్టలేమని... విచారణ చేపట్టడం వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించింది. పిటిషన్ ను కొట్టివేసింది.

  • Loading...

More Telugu News