Rehana Fathima: రెహానా ఫాతిమాకు ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు

Activist Rehana Fathima granted conditional bail

  • తన అర్ధనగ్న శరీరంపై పిల్లలతో పెయింటింగ్
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • కొవిడ్ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేసిన కోర్టు

కేరళకు చెందిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు ఊరట లభించింది. తన అర్ధనగ్న శరీరంపై పిల్లలతో పెయింటింగ్ వేయించుకున్న కేసులో ఆమెకు ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తులు ఆమెకు జామీను ఇవ్వడంతో న్యాయమూర్తి ఆమెకు బెయిలు మంజూరు చేశారు.

కరోనా నేపథ్యంలో బెయిలు మంజూరు చేయడమే మంచిదని భావించిన కోర్టు ఆమెకు ఊరటనిచ్చే ఆదేశాలు జారీ చేసింది. రెహానా తన అర్ధనగ్న శరీరంపై పిల్లలతో పెయింటింగ్ వేయించుకుంటూ తీసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు ఆమెపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. కాగా, బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి ప్రతి సోమవారం పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించారు.

Rehana Fathima
Kerala
Bail
child video case
  • Loading...

More Telugu News