Kathi Mahesh: మళ్లీ అరెస్ట్ అయిన కత్తి మహేశ్.. జైలులోనే అదుపులోకి!

Kathi Mahesh arrested once again

  • శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన మహేశ్
  • తాజాగా, మరో వ్యక్తి ఫిర్యాదుపై అదుపులోకి
  • జైలులో ఉండడంతో పీటీ వారెంట్‌పై అరెస్ట్

సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ గురువారం మరోమారు అరెస్టయ్యారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అనుచిత పోస్టులు చేసిన కేసులో ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కత్తి మహేశ్‌ను అరెస్ట్ చేశారు. ‘రాముడు కరోనా ప్రియుడు’ అని పోస్టులు చేయడంతో కత్తి మహేశ్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. స్పందించిన పోలీసులు 154 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు.

ఫిబ్రవరి నెలలో ఇలానే సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ జాంబాగ్‌కు చెందిన ఉమేశ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న మహేశ్‌ను పీటీ వారెంట్‌పై తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరిచినట్టు పోలీసులు తెలిపారు. కాగా, 2018లోనూ రాముడిపై ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో కత్తి మహేశ్‌ను పోలీసులు నగరం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

Kathi Mahesh
Cine critic
Tollywood
Police
arrest
  • Loading...

More Telugu News