Tamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Thamanna latest movie has been titled
  • తమన్నా తాజా చిత్రానికి రొమాంటిక్ టైటిల్ 
  • విజయ్ 'మాస్టర్' మరోసారి వాయిదా
  • ప్రభాస్ 'రాధే శ్యామ్' విడుదలపై అప్ డేట్  
*  తమన్నా, సత్యదేవ్ జంటగా నాగశేఖర్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ మూవీ రూపొందుతోంది. కన్నడలో హిట్టయిన 'లవ్ మాక్ టైల్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు తాజా సమాచారం.
*  లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' చిత్రం పూర్తయినప్పటికీ థియేటర్లు మూతబడడం కారణంగా విడుదల కాకుండా ఆగిపోయిన సంగతి విదితమే. ఇది దీపావళికి రిలీజ్ అవుతుందంటూ నిన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడీ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారట.
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రం తదుపరి షూటింగును అక్టోబర్ నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇక వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తారట.  
Tamanna
Vijay
Prabhas
Pooja Hegde

More Telugu News