SP Balasubrahmanyam: భగవంతుడు నా ఆయుష్షుని కూడా ఆయనకిచ్చి కాపాడాలి: బి.సరోజాదేవి

I pray God to save SP Balu says B Saroja Devi
  • బాలుకు కరోనా అని తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను
  • ఆయన త్వరగా కోలుకోవాలి
  • పాటలు పాడి అందరినీ అలరించాలి
కరోనా బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. తాజాగా బాలు పరిస్థితిపై అలనాటి సినీనటి బి.సరోజాదేవి స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలు ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు. బాలుకు తన ఆయుష్షుని కూడా ఇచ్చి కాపాడాలని భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని... మరిన్ని పాటలు పాడి అందరినీ అలరించాలని ఆకాంక్షించారు.
SP Balasubrahmanyam
B Saroja Devi
Corona Virus
Tollywood

More Telugu News