MS Dhoni: కళాకారులు, సైనికులు, క్రీడాకారులు కోరుకునేది అభినందనలే!: ధోనీ

Dhoni thanked PM Modi for appreciation after retirement from international career

  • అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ
  • శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
  • ట్విట్టర్ లో మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ధోనీ

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘ సందేశం పంపారు. దీనిపై ధోనీ వినమ్రంగా బదులిచ్చాడు. ప్రధాని మోదీ తనను మెచ్చుకున్నందుకు, శుభాకాంక్షలు తెలిపినందుకు ఆయనకు ధోనీ కృతజ్ఞతలు తెలిపాడు. "ఎవరైనా కళాకారుడు కానీ, సైనికుడు కానీ, క్రీడాకారుడు కానీ కోరుకునేది అభినందనలే. తమ కఠోర శ్రమను, త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించి మెచ్చుకోవాలని భావిస్తారు" అంటూ ట్వీట్ చేశాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News