Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణం పనులు ప్రారంభం.. ఆలయం ఎప్పట్లోగా పూర్తికానుందంటే..!

Ayodhya Ram Mandir temple construction works started

  • సాయిల్ టెస్టింగ్ చేస్తున్న ఇంజినీర్లు
  • 36 నుంచి 40 నెలల కాలంలో నిర్మాణం పూర్తి
  • ఉక్కును వినియోగించకుండానే ఆలయ నిర్మాణం

ఈ నెల 5వ తేదీన అయోధ్య రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమిపూజ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. ఆలయాన్ని నిర్మించే ప్రాంతంలో ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి ఐఐటీ మద్రాస్, సీబీఆర్ఐ రూర్కీ ఇంజినీర్లు సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారు. 36 నుంచి 40 నెలల కాలంలో ఆలయం నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.

మన పురాతన, సంప్రదాయబద్ధమైన నిర్మాణ నైపుణ్యాలను అనుసరించి మందిర నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా రామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. భూకంపాలు, తుపానులతో పాటు అన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించింది. మందిర నిర్మాణంలో ఉక్కును వాడటం లేదని తెలిపింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News