KTR: ఇళ్లకు తాగునీటి సరఫరాలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ.. మంత్రి కేటీఆర్ హర్షం

Govt of Indias Ministry of Jal Shakti reports

  • తెలంగాణలో 98.31 శాతం ఆవాసాలకు నల్లాలతో తాగునీరు
  • కేంద్ర జల ‌శక్తి మంత్రిత్వశాఖ జల్‌ జీవన్‌ మిషన్‌ వెల్లడి
  • తెలంగాణలో మొత్తం 53.46 లక్షల ఇళ్లకు తాగునీరు
  • కేసీఆర్ దూరదృష్టికి అభినందనలు

తెలంగాణ 98.31 శాతం ఆవాసాలకు నల్లాలతో తాగునీటిని అందిస్తూ దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిన్న కేంద్ర జల ‌శక్తి మంత్రిత్వశాఖ జల్‌ జీవన్‌ మిషన్‌ వివరాలు ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 54.38 లక్షల ఆవాసాలుండగా వాటిల్లో 53.46 లక్షల ఇళ్లకు తాగునీరు అందుతోంది. తెలంగాణ తర్వాతి స్థానంలో 89.05 శాతంతో గోవా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
                       
'కేంద్ర జల శక్తి నివేదిక ప్రకారం.. తెలంగాణ  98.31 శాతం నల్లాల కనెక్షన్లతో తాగునీరు అందిస్తూ లీడర్‌గా నిలిచింది. మార్గదర్శకంగా నిలుస్తోన్న మిషన్ భగీరథ ద్వారా ఈ తాగు నీరు అందుతోంది. ఈ అద్భుత విజయానికి గౌరవ సీఎం కేసీఆర్ దూరదృష్టికి, కష్టపడి పనిచేచేసిన ఆర్‌డబ్ల్యూఎస్‌ టీమ్‌కు అభినందనలు' అని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాగా, ఈ జాబితాలో కేవలం 34.62 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News