Sonu Sood: సాయం కోరుతూ నాకు ఒక్కరోజులో ఇన్ని మెసేజ్‌లు వచ్చాయి!: సోను సూద్ ఆసక్తికర పోస్ట్

Sonusood Todays HELP messages

  • 1,137 మెయిల్స్‌, 19,000 ఫేస్‌బుక్ మెసేజ్‌లు
  • 4,812 ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌లు, 6,741 ట్విట్టర్‌ మెసేజ్‌లు
  • ప్రతిఒక్కరికీ సాయం చేయడం అసాధ్యం

సాయం చేయాలని కోరిన వెంటనే ప్రతి స్పందిస్తూ పెద్ద మనసు చాటుకుంటూ రియల్ హీరో అనిపించుకుంటోన్న సినీనటుడు సోను సూద్ తాజాగా తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. సాయం చేయాలంటూ ఆయనకు వేలాది మంది నుంచి మెసేజ్‌లు వస్తున్నాయట.

దీని గురించి చెబుతూ, ఈ రోజు తనకు 1,137 మెయిల్స్‌, 19,000 ఫేస్‌బుక్ మెసేజ్‌లు, 4,812 ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌లు, 6,741 ట్విట్టర్‌ మెసేజ్‌లు వచ్చాయని సోను సూద్ వివరించాడు. అయితే, ప్రతిఒక్కరికీ సాయం చేయడం అసాధ్యమని ఆయన చెప్పాడు. తనకు వీలైనంత మేరకు సాయం చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.

ఎవరి మెసేజ్‌లయినా మిస్ అయితే క్షమించాలని ఆయన కోరాడు. కాగా, సోను సూద్‌కు అన్ని వర్గాల ప్రజల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. తమకు ల్యాప్‌టాప్‌లు పంపాలని కూడా విద్యార్థులు అడుగుతుండడం గమనార్హం.

Sonu Sood
Tollywood
Bollywood
Twitter
  • Loading...

More Telugu News