Jagan: నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- వైయస్సార్ విద్యా కానుక పథకానికి ఆమోదం
- బీసీ ఫెడరేషన్లు, రామనపాడు పోర్టు డీపీఆర్ కి ఆమోదం
- వైయస్సార్ సంపూర్ణ పోషకాహార పథకానికి ఆమోదం
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే.
- నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదముద్ర. 2020 నుంచి 2023 వరకు నూతన పారిశ్రామిక విధానం అమల్లో ఉంటుంది.
- నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు.
- వైయస్సార్ విద్యా కానుక పథకానికి ఆమోదం. వచ్చే నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానున్న పథకం.
- బీసీ ఫెడరేషన్లు, రామనపాడు పోర్టు డీపీఆర్ కి ఆమోదం.
- వైయస్సార్ సంపూర్ణ పోషకాహార పథకానికి ఆమోదం. ఈ పథకం ద్వారా మహిళలు, శిశువులకు పూర్తి స్థాయిలో పోషకాహారం అందించనున్న ప్రభుత్వం. సెప్టెంబర్ 1న పథకం ప్రారంభం.
- పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్ మెంట్ అధికారుల పోస్టులకు ఆమోదముద్ర.
- సెప్టెంబర్ 11న వైయస్సార్ ఆసరా పథకానికి ముహూర్తం.