Tamilisai Soundararajan: గవర్నర్ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి: బీజేపీ నేత కృష్ణసాగర్ రావు

BJP demands KCR to respond on Governors comments
  • కరోనా కట్టడిపై ప్రభుత్వం విఫలమైందని తమిళిసై విమర్శలు
  • ప్రభుత్వం సిగ్గుపడాలన్న కృష్ణసాగర్ రావు
  • ఇప్పటికైనా తప్పులను ప్రభుత్వం సరిదిద్దుకోవాలి
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు టీఆర్ఎస్ పై మండిపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలతో ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. తమిళిసై స్వయంగా డాక్టర్ అని... దీంతో, ఆమె తొలి నుంచి కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గమనిస్తున్నారని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఆమె బహిరంగ విమర్శలు చేశారని తెలిపారు. గవర్నర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.
Tamilisai Soundararajan
Telangana
Governor
KCR
TRS
Krishna Sagar Rao

More Telugu News