Oxford: ఇండియాలో తొలుత అందుబాటులోకి వచ్చేది ఆక్స్ ఫర్డ్ వ్యాక్సినే!

Oxford Vaccine will be the first shot in India

  • స్థానిక వ్యాక్సిన్ లనూ పరిశీలిస్తున్నామన్న అధికారి
  • ముందు వచ్చేది ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్
  • ఆపై కొన్ని వారాలకు దేశవాళీ వ్యాక్సిన్

ఇండియాలో దేశవాళీ సంస్థలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కన్నా ముందుగానే ఆక్స్ ఫర్ట్, అస్ట్రాజెనికా తయారు చేస్తున్న వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర అధికారి ఒకరు తెలిపారు. ఈ సంవత్సరం చివరిలోగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, స్థానికంగా తయారవుతున్న వ్యాక్సిన్ లను నిశితంగా గమనిస్తున్నామని, అవి కూడా త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని ఆయన అన్నారు.

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు, దేశవాళీ వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడానికి మధ్య కొన్ని వారాల గడువు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కే తొలుత అనుమతి లభిస్తుందని భావిస్తున్నామని, ఈ వ్యాక్సిన్ ను పుణె కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ట్రయల్స్ నిర్వహిస్తూనే భారీ ఎత్తున తయారు చేసే ప్రక్రియలో ఉందని తెలిపారు. ప్రస్తుతం సీరమ్ ఇనిస్టిట్యూట్ మూడవ దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా వంటి కంపెనీలు తొలి, రెండవ దశ ట్రయల్స్ లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News