Nara Lokesh: జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి గారి నేర మనస్తత్వమే కారణం: నారా లోకేశ్

lokesh fires on ycp leaders

  • జగన్ గారు ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు
  • రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసం
  • కడప జైలులో జేసీ ప్రభాకర్‌ రెడ్డి కరోనా బారిన పడటం బాధాకరం
  • తక్షణమే ఆసుపత్రికి తరలించాలి

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'వైఎస్‌ జగన్ గారు ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బెయిల్ పై రిలీజ్ అయ్యిన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్లీ అరెస్ట్ చేశారు. ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం బాధాకరం' అనిపేర్కొన్నారు.

'జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి గారి నేర మనస్తత్వమే కారణం. తక్షణమే ఆసుపత్రికి తరలించి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Nara Lokesh
JC Prabhakar Reddy
Telugudesam
Corona Virus
  • Loading...

More Telugu News