Rajinikanth: అభిమానుల నిరీక్షణ ఫలిస్తోంది.. చాలా కాలం తర్వాత కలిసి నటించనున్న నట దిగ్గజాలు!

Rajinikanth and Kamal Haasan to share the screen
  • కెరీర్ తొలినాళ్లలో కలిసి నటించిన కమల్, రజనీ
  • ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలు
  • రాజ్ కమల్ బ్యానర్ పై సినిమా తెరకెక్కే అవకాశం
తమిళ చిత్ర పరిశ్రమలో కమలహాసన్, రజనీకాంత్ లది ప్రత్యేక స్థానం. దశాబ్దాలుగా ఇద్దరూ ప్రేక్షకులపై తమదైన ముద్ర వేస్తున్నారు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి తమ సినీ జీవితాన్ని ప్రారంభించి.. అలా.. అలా.. స్టార్లుగా ఎదిగిపోయారు. తమ కెరీర్ తొలినాళ్లలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. వీరద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది.

అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న టైమ్ వచ్చేసిందని తమిళ దర్శకుడు కనకరాజ్ తీపి కబురు అందించారు. రజనీ, కమల్ ఇద్దరూ నటించే చిత్రంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ప్రాథమిక దశ చర్చలు పూర్తయ్యాయని.. అంతా సవ్యంగా జరగితే అద్భుతం జరిగినట్టేనని ఆయన చెప్పారు. కమల్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ బ్యానర్ పై సినిమా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఈ చిత్రం బహు భాషల్లో తెరకెక్కే అవకాశం ఉంది. మరోవైపు, ఈ ప్రకటనతో సినీ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఈ చిత్రం రికార్డులను బద్దలు కొడుతుందనే అంచనాలు అప్పుడే ప్రారంభమయ్యాయి.
Rajinikanth
Kamal Haasan
Movie

More Telugu News