Pranab Mukherjee: కోమాలో ప్రణబ్ ముఖర్జీ.. వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స!

Pranab Mukharjee In Coma

  • పరిస్థితి అత్యంత విషమం 
  • కోమా నుంచి బయటకు వస్తేనే ఆరోగ్యంపై అంచనా
  • కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులు

84 సంవత్సరాల వయసులో మెదడులో గడ్డకట్టిన రక్తానికి శస్త్రచికిత్స చేయించుకుని, కరోనా బారిన పడిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోమాలోకి వెళ్లిపోయారని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ వర్గాలు నేడు వెల్లడించాయి. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారిందని, వెంటిలేటర్ సపోర్ట్ ను కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు.

నిన్న ఆయన ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడిందని ప్రకటన రావడంతో, ఆయన కోలుకుంటారని పార్టీ వర్గాలు, అభిమానులు భావించారు. ఇంతలోనే ఆయన కోమాలోకి వెళ్లారని వచ్చిన ప్రకటన వారిలో ఆందోళనను పెంచుతోంది. ప్రణబ్ కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. ప్రణబ్ కోమా నుంచి బయటకు వస్తేనే ఆరోగ్యంపై ఓ అంచనాకు రావచ్చని ఎయిమ్స్ డాక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు.

Pranab Mukherjee
Coma
Army Hospital
  • Loading...

More Telugu News