Amit Shah: అమిత్ షాకు మళ్లీ కొవిడ్ సోకలేదు: ఎయిమ్స్

Corona Negative for Amit Shah

  • కరోనా నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే అనారోగ్యం
  • ఈ ఉదయం కరోనా పరీక్ష చేసిన వైద్యులు
  • హాస్పిటల్ నుంచే ఆఫీసు కార్యకలాపాలు సాగిస్తారని ప్రకటన

గత రాత్రి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యానికి గురై, ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే.  ఆయన శ్వాస కోశ సమస్యలతో పాటు, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చేరగానే, ఆయనకు మళ్లీ కరోనా సోకిందేమోనన్న అనుమానంతో, ఈ ఉదయం నమూనాలను స్వీకరించి పరీక్షలు జరిపించామని, నెగటివ్ వచ్చిందని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.  ఆయన ప్రస్తుతం ఒంటినొప్పులతోనే బాధపడుతున్నారని, ఆసుపత్రి నుంచే తన ఆఫీసు వ్యవహారాలను చక్కబెట్టే స్థితిలో ఉన్నారని తెలిపారు. కాగా, ఇటీవల అమిత్ షాకు కరోనా సోకగా, గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ లో చికిత్స పొంది, గత శుక్రవారం డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

Amit Shah
AIIMS
Corona
Negative
  • Loading...

More Telugu News