Atchannaidu: కరోనా సోకిన అచ్చెన్నాయుడిని ఎన్నారై ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు

Police ready to shift Atchannaidu to NRI Hospital
  • ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణలతో అరెస్టయిన అచ్చెన్న
  • అనారోగ్యం కారణంగా గుంటూరు రమేశ్ ఆసుపత్రిలో చికిత్స
  • కొన్నిరోజుల కిందట అచ్చెన్నకు కరోనా పాజిటివ్
ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణలతో అరెస్టయిన మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇటీవలే రెండు పర్యాయాలు శస్త్రచికిత్స చేయించుకున్న అచ్చెన్నాయుడు గుంటూరు రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రి అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై ఇచ్చిన నివేదికను హైకోర్టు పరిశీలించింది. ఈ క్రమంలో మాజీమంత్రిని ఎన్నారై ఆసుపత్రికి తరలించాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో అచ్చెన్నాయుడిని ఎన్నారై ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయనను రమేశ్ ఆసుపత్రి నుంచి తరలించనున్నారు.
Atchannaidu
NRI Hospital
Corona Virus
ESI Scam
Police

More Telugu News