Mahesh Babu: మహేశ్ బాబు సినిమాకి అమెరికా షెడ్యూలు?

America schedule planned for Mahesh movie

  • బ్యాంకు స్కాముల కథతో 'సర్కారు వారి పాట'
  • మహేశ్ సరసన కథానాయికగా కీర్తి సురేశ్
  • నవంబర్ మొదటి వారంలో అమెరికాలో షూటింగ్

ఇటీవలి కాలంలో మన దేశంలో బ్యాంకు స్కాములు ఎన్నో చోటుచేసుకున్నాయి. వందలు.. వేల కోట్లకు జాతీయ బ్యాంకులను మోసం చేసి దర్జాగా ఫారిన్ దేశాలకు చెక్కేసిన ఘనులు కూడా వున్నారు. ఇక చిన్నా చితకా బ్యాంకు స్కాములకు అయితే లెక్కేలేదు... ప్రతి రోజూ అలాంటి వార్త ఏదో ఒకటి మనం పేపర్లలో చూస్తూనే వుంటాం.

ఇదే ఇతివృత్తాన్ని మహేశ్ బాబు నటించే తదుపరి చిత్రానికి కథావస్తువుగా ఎంచుకున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'సర్కారు వారి పాట'. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.

ఆమధ్య లాంఛనంగా పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ షెడ్యూలు నవంబర్ నెల మొదటి వారంలో ప్రారంభమవుతుందని అంటున్నారు. కథ ప్రకారం కొంత షూటింగును విదేశాలలో చేయాలట. అందుకే, తొలి షెడ్యూలును ఒక నెలరోజుల పాటు అమెరికాలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, కరోనా పరిస్థితులు కుదుటపడడాన్ని బట్టి అమెరికా షెడ్యూలును నిర్వహిస్తారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News