Pranab Mukherjee: ప్రణబ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్న వైద్యులు

Doctors says pranab health still critical

  • కరోనాకు తోడు తీవ్ర అనారోగ్యం
  • ఇటీవలే శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు
  • ప్రణబ్ ఇప్పటికీ వెంటిలేటర్ పైనే ఉన్నారన్న ఆసుపత్రి వర్గాలు

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, ఆయన ఇంకా విషమ స్థితిలోనే ఉన్నారని వైద్యులు తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో పాటు కరోనా వైరస్ సోకడంతో ప్రణబ్ ముఖర్జీ కొన్నిరోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 10న ప్రణబ్ కు శస్త్రచికిత్స నిర్వహించినా ఆరోగ్యం మెరుగపడలేదు.

దీనిపై ఆర్మీ వైద్యులు మాట్లాడుతూ, ప్రణబ్ ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని వెల్లడించారు. ఆయన పలు రకాల అనారోగ్యాల సమస్యలతో బాధపడుతున్నారని, నిపుణులైన వైద్య బృందం ఆయనను నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. కాగా, ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ స్పందిస్తూ, తన తండ్రి ప్రణబ్ ఆరోగ్యం కాస్త మెరుగైందని అన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని, గతంలో కంటే ఇప్పుడు చికిత్సకు మరింతగా స్పందిస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే కోలుకుంటారని తెలిపారు.

  • Loading...

More Telugu News