warangal: వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు

Heavy Rains in warangal and karimnagar district

  • ఒక్కటైన వాగులు, వంకలు
  • చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
  • రహదారులు దెబ్బతినడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోజుల తరబడి ఆగకుండా కురుస్తున్న వర్షం కారణంగా పంట పొలాలు నీటమునిగాయి. వరినాట్లు మునిగిపోయాయి. పత్తి, కంది, మొక్క జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది.

చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. చెరువులకు గండ్ల భయంతో చాలా ప్రాంతాల్లో స్థానికులు మత్తళ్లను తవ్వేశారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. భారీ వర్షాల కారణంగా చాలా గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News