Bithiri Sathi: కరోనా బారినపడిన బిత్తిరి సత్తి

TV presenter Bithiri Sathi tested corona positive
  • తలనొప్పితో బాధపడుతున్న సత్తి
  • టెస్టులో కరోనా పాజిటివ్
  • ఐసోలేషన్ లో ఉన్నట్టు వెల్లడి
ప్రముఖ టీవీ నటుడు బిత్తిరి సత్తి కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వయంగా బిత్తిరి సత్తి తనకు కరోనా సోకిన విషయం వెల్లడించారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. తనకు కరోనా ఎక్కడ సోకిందన్న విషయం కచ్చితంగా చెప్పలేనని, మీడియాలో పనిచేస్తున్నందున కొన్ని సందర్భాల్లో వివిధ ప్రదేశాలకు వెళ్లాల్సి రావడంతో కరోనా సోకినట్టు భావిస్తున్నానని తెలిపారు. మీడియాలో పనిచేసే కొందరు సహచరులకు కూడా కరోనా వచ్చిందని అన్నారు. రెండ్రోజుల క్రితం స్వల్పంగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు రావడంతో టెస్టు చేయించుకున్నానని, ఆ టెస్టులో పాజిటివ్ అని వచ్చిందని సత్తి పేర్కొన్నారు.
Bithiri Sathi
Corona Virus
Positive
TV Presenter

More Telugu News