Payal Rajput: టాలీవుడ్ లో ఈ ముగ్గురు హీరోలతో నటించాలనేది నా కోరిక: పాయల్ రాజ్ పుత్

Paya expressed her desire to act with three stars
  • ఆర్ఎక్స్100 చిత్రంతో దూసుకొచ్చిన పాయల్
  • అందంతో పాటు అభినయం ఆమె సొంతం
  • పవన్, మహేశ్, ప్రభాస్ లతో నటించాలనే కోరికను వెలిబుచ్చిన పాయల్
ఆర్ఎక్స్100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఉత్తరాది భామ పాయల్ రాజ్ పుత్ ఒక్కసారిగా దూసుకొచ్చింది. తొలి సినిమాతోనే కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది. 'వెంకీమామ' చిత్రంలో వెంకటేశ్ సరసన కూడా నటించి, మెప్పించింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా పాయల్ తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తెలుగు హీరోల్లో ఎవరితో నటించాలని ఉందని పాయల్ కు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ సరసన నటించాలనుందనే కోరికను పాయల్ వ్యక్తం చేసింది. స్టార్ హీరోలతో పని చేయాలనే ఈ అమ్మడి కోరిక మరి ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి.
Payal Rajput
Tollywood
Favourite Stars

More Telugu News