keerti suresh: 'నువ్వు రామారావు అయితే.. నేను సావిత్రిని' అంటోన్న కీర్తి సురేశ్.. కొత్త సినిమా టీజర్ విడుదల

keerti suresh new movie teaser realease

  • లేడి ఓరియెంటెడ్ సినిమాగా 'గుడ్ ల‌క్ స‌ఖి' 
  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజర్ విడుదల
  • అలరిస్తోన్న కీర్తి సురేశ్ డైలాగులు
  • అదృష్టం లేని ఒక పల్లెటూరి అమ్మాయిగా కీర్తి

హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోన్న లేడి ఓరియెంటెడ్ సినిమా 'గుడ్ ల‌క్ స‌ఖి'  టీజ‌ర్‌ విడుదలైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ప్ర‌భాస్ చేతుల మీదుగా ఆ సినిమా బృందం విడుదల చేయించింది. 'నువ్వు రామారావు అయితే.. నేను సావిత్రిని', 'మన రాతను మనమే రాసుకోవాలి' అంటూ కీర్తి సురేశ్ చెబుతున్న డైలాగులు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

అదృష్టం లేని ఒక పల్లెటూరి అమ్మాయిగా జీవితాన్ని మొదలు పెట్టి,  రైఫిల్‌ షూటింగ్‌లో ఎలా ఎదిగిందన్న కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె కోచ్‌గా జగపతి బాబు నటిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను సుధీర్‌, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా మూడు భాషల్లో   ప్రేక్షకుల ముందుకు రానుంది.                      
                          

  • Error fetching data: Network response was not ok

More Telugu News