Narendra Modi: యువతుల కనీస వివాహ వయసుపై త్వరలో నిర్ణయం: ఎర్రకోట పైనుంచి మోదీ

PM Modi speech from redfort on eve of Independence day

  • కరోనా వ్యాక్సిన్ కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాం
  • జీఎస్టీతో వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయి
  • ప్రపంచానికి గొప్ప వృత్తి నిపుణులను అందించిన ఘనత భారత మధ్యతరగతిదే

స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్, జీఎస్టీ, నూతన విద్యావిధానం వంటి వాటిపై సమగ్రంగా మాట్లాడారు. యువతుల కనీస వివాహ వయసు నిర్ధారణ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపిన మోదీ.. మహిళల్లో పోషకాహార లోపాల నివారణకు చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు.

వెయ్యి రోజుల్లో ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్ నెట్‌ను తీసుకెళ్లామని, ఆరేళ్లలో లక్షన్నర గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. జీఎస్టీతో చాలా వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని అన్నారు. ప్రపంచానికి గొప్ప వృత్తి నిపుణులను అందించిన ఘనత భారత మధ్యతరగతిదేనని మోదీ పేర్కొన్నారు.

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిపై ప్రధాని మాట్లాడుతూ.. కరోనాను అంతమొందించే టీకా కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. వ్యాక్సిన్ కోసం మన శాస్త్రవేత్తలు తపస్సులా పరిశోధనలు చేస్తున్నారని కొనియాడారు. వారి శ్రమ త్వరలోనే ఫలిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు వ్యాక్సిన్లు తుది దశ పరీక్షల్లో ఉన్నాయని ప్రధాని వివరించారు.

  • Loading...

More Telugu News