ilayaraja: బాలూ.. కోలుకుని త్వరగా వచ్చెయ్.. నీ కోసం ఎదురుచూస్తుంటాను: ఇళయరాజా

Our frindship will not end with movies Ilayaraja responds on SPB Health

  • నాకు తెలుసు.. నువ్వొస్తావు
  • సినిమాల కంటే ముందే మన స్నేహం మొదలైంది
  • మన స్నేహం ఎప్పటికీ దూరం కాదు.. లేచి రా!

కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకుని రావాలని ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఇళయరాజా ఆకాంక్షించారు. మనద్దరి జీవితం కేవలం సినిమాలతోనే మొదలైంది కాదని, అలాగని సినిమాతోనే ముగిసిపోదంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ మధ్య పెనవేసుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమాల కంటే ముందే సంగీత వేదికలపై ఇద్దరం కలిసి కచేరీలు చేశామని, అలా మొదలైన మన స్నేహం.. సంగీతం, స్వరం లాంటిదని పేర్కొన్నారు.

స్వరం లేని సంగీతం ఎలా ఉండదో, అలానే నీ స్నేహం, నా స్నేహం, మన స్నేహం ఎప్పటికీ దూరం కాదన్నారు. ఇద్దరి మధ్య గొడవలకు స్నేహానికి సంబంధం లేదని, స్నేహం ఎప్పటికీ స్నేహమేనన్న విషయం నీకూ తెలుసు, నాకూ తెలుసని, కాబట్టి కోలుకుని త్వరగా లేచి రా అని ఆ వీడియోలో కోరారు. నువ్వు తిరిగి వస్తావని నా అంతరాత్మ చెబుతోందని, అది నిజం కావాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని ఇళయరాజా ఆ వీడియోలో ఆకాంక్షించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News