Kamala Harris: ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న కమల హారిస్ దోసె వీడియో

US Vice President candidate Kamala Harris Dosa video went viral

  • అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న కమల
  • డెమొక్రాట్ల తరఫున బరిలో దిగిన భారత సంతతి మహిళ
  • ట్రంప్ వ్యాఖ్యలతో మరింత ప్రచారం పొందుతున్న కమలా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ కంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు కమల హారిస్. భారత సంతతికి చెందిన కమల హారిస్ డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ సైతం కమల హారిస్ నే లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తుండడం పరోక్షంగా ఆమెకు విపరీతమైన ప్రచారం తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో, కమల హారిస్ కు చెందిన మసాలా దోసె వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.

గతేడాది, భారత సంతతి అమెరికా టెలివిజన్ నటీమణి వెరా కిండీ కాలింగ్ తో కలిసి కమలా హారిస్ ఓ షోలో సందడి చేశారు. మసాలా దోసె వేయడంలో కిండీ కాలింగ్ కు సహకరించారు. ఈ సందర్భంగా ఆమె తనదైన శైలిలో మాట్లాడి వీక్షకులను అలరించారు. ఇప్పుడామె అమెరికా ఉపాధ్యక్ష పదవికి రేసులో ఉండడంతో ఈ దోసె వీడియో బాగా సర్క్యులేట్ అవుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News