Anchor Suma: మణీ... నా బ్లౌజ్ నేనే కుట్టుకుని షూటింగ్ కు వెళ్తున్నా: యాంకర్ సుమ

Anchor Suma posts new video of stitching her blouse

  • కరోనా సమయంలో కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సుమ
  • పలు వీడియోలతో అభిమానులను అలరిస్తున్న టాప్ యాంకర్
  • ఏం చేస్తున్నానో అడుగు మణీ.. అంటూ తాజాగా మరో వీడియో

తెలుగు యాంకర్లలో సుమది ఒక ప్రత్యేక స్థానం. సంవత్సరాలు గడిచిపోతున్నా అగ్ర స్థానంలో ఆమే కొనసాగుతున్నారు. అది టీవీ షో అయినా, సినీ కార్యక్రమం అయినా... షోను రక్తికట్టించడంలో ఆమెకు ఆమే సాటి. సందర్భానుసారంగా ఆమె నోటి నుంచి జాలువారే మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కరోనా సమయంలో కూడా ఆమె సందడి తగ్గలేదు. ఇంటి వద్ద నుంచి ఆమె పోస్ట్ చేసిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె పోస్ట్ చేసిన మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షూటింగ్ కు వెళ్లే ముందు బ్లౌజ్ ను కుట్టుకుంటూ తన పనిమనిషితో ఆమె మాట్లాడుతున్న వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియో మీరూ చూడండి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News