Raghurama Krishnaraju: ఒరే... నా ఇంటి ముందుకొస్తే మిమ్మల్ని కాల్చి పడేస్తారు: రఘురామకృష్ణరాజు ఉగ్రరూపం

Raghurama Krishnaraju fires on threatening callers

  • తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న ఎంపీ
  • అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తున్నారని వెల్లడి
  • రాజీనామా చేయాలంటున్నారని వివరణ

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. గత కొన్నిరోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయాన్ని వెల్లడించారు. అమెరికా నుంచి కూడా తనకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని వివరించారు. రేయ్ ఏమనుకుంటున్నావురా... నిన్ను లేపేస్తాం నా****కా అంటూ మాట్లాడుతున్నారని తెలిపారు. వాళ్ల ఫోన్ నెంబర్లన్నీ తన వద్ద ఉన్నాయని అన్నారు. ఒకవేళ కంప్లెయింట్ చేస్తే, అక్కడ పేరు చివర రెండక్షరాల సామాజిక వర్గం వాళ్లు ఉంటే న్యాయం జరగదన్న ఉద్దేశంతో ఆగిపోతున్నానని వివరించారు.

"నిన్న ఒకడు, ఇవాళ మరొకడు కూడా బెదిరిస్తూ ఫోన్ చేశారు. ఏదో చేస్తారంట! ఏమవుతుంది? నా ఇంటి వద్దకు రండి... షూట్ చేసి పడదొబ్బుతారు మిమ్మల్ని! సీఆర్పీఎఫ్ వాళ్లు కాల్చిపడేస్తారు. ఇంటర్నెట్ లో ఫోన్ నెంబర్ ఉంది కదా అని ఊరికే ఫోన్ చేయడం... రాజీనామా చేయ్ అంటారు. నేనెందుకు రాజీనామా చేయాల్రా యూజ్ లెస్ ఫెలో!" అంటూ నిప్పులు కురిపించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News