PVP: జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరైన పీవీపీ

YSRCP leader PVP attends for police interrogation
  • తన వద్ద పని చేసిన వ్యక్తిని  కిడ్నాప్ చేసిన కేసు
  • విల్లాకు సంబంధించి మరో వ్యక్తితో గొడవ
  • రెండు కేసులకు సంబంధించి విచారణకు హాజరైన పీవీపీ
వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. తన వద్ద మేనేజర్ గా పని చేసిన తిమ్మారెడ్డి అనే వ్యక్తిని గత సెప్టెంబర్ 16న పీవీపీ కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీవీపీని ఏ1 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.

అనంతరం బంజారాహిల్స్ లో ఓ విల్లాకు సంబంధించిన గొడవలో ఆ విల్లా యజమాని పీవీపీపై ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయనను ప్రశ్నించేందుకు వెళ్లిన పోలీసులపై పీవీపీ కుటుంబసభ్యులు కుక్కలను వదిలారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో పీవీపీ హైదరాబాదును వీడి విజయవాడకు వెళ్లిపోయారు. ఆ తర్వాత  తెలంగాణ హైకోర్టులో బెయిల్ పొందారు. అయితే, ఈ రెండు కేసుల విచారణకు రావాలని పోలీసులు పిలవడంతో... ఆయన ఈరోజు పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు.
PVP
YSRCP
Case
Jubili Hills police station

More Telugu News