Honda: యాక్టివా ధరలను పెంచిన హోండా!

Honda Hikes Activa Price

  • రూ. 955 మేరకు ధరల పెంపు
  • మూడు నెలల వ్యవధిలో రెండోసారి ధర పెంపు
  • ఇప్పటికే బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ గా ఉన్న యాక్టివా

ఇటీవల భారత టూ వీలర్ మార్కెట్లో విడుదలైన యాక్టివా 6జీ ధరలను రూ.955 మేరకు పెంచుతున్నట్టు హోండా వెల్లడించింది. ఈ వేరియంట్ స్టాండర్డ్ మోడల్ ధర ఇకపై రూ.65,419 అని, డీలక్స్ వేరియంట్ ధర రూ. 66,919 (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఈ సంవత్సరం జనవరిలో ఈ స్కూటర్ మార్కెట్లోకి రాగా, ఏప్రిల్ లో రూ.522 మేరకు ధరను పెంచిన సంస్థ, మూడు నెలలు తిరిగేసరికి మరోసారి ధరలను పెంచడం గమనార్హం. ఈ ధరల పెంపునకు కారణాన్ని సంస్థ వెల్లడించలేదు.

కాగా, ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ గా యాక్టివా కొనసాగుతోంది. యాక్టివాలో ఆరవ తరం వాహనంగా వచ్చిన 6జీలో ఇంజన్ స్టార్ట్ - స్టాప్ స్విచ్, మల్టీ ఫంక్షన్ ఇగ్నిషన్ కీ, ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ క్యాప్ తదితర సౌకర్యాలు ఉంటాయి. బీఎస్-6 నిబంధనలను కూడా ఇది పాటిస్తుంది. 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో ఇది లభిస్తుందన్న సంగతి తెలిసిందే. ఆరు విభిన్న రంగుల్లో ఇది లభిస్తుంది. డీలక్స్ మోడల్ లో ఎల్ఈడీ హెడ్ లైట్ ను కలిగివుంటుంది.

Honda
Activa
Price Hike
  • Loading...

More Telugu News