Yajuvendra Chahal: కాబోయే భార్యతో ఉన్న పిక్ ను షేర్ చేసుకున్న యజువేంద్ర చాహల్

Yajuvendra Chahal Pic with Dhanasri goes Viral

  • ధనశ్రీ వర్మతో చాహల్ నిశ్చితార్థం
  • లవ్ సింబల్ చూపిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పిక్
  • జంట బాగుందని కామెంట్లు

తనకు కాబోయే భార్య ధనశ్రీ వర్మతో కలిసున్న పిక్ ను భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకోగా, అది వైరల్ అయింది. ఈ జంట చూడముచ్చటగా ఉందని కామెంట్లు వస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది.

ఇక ధనశ్రీ నేలపై కూర్చుని ఉండగా, పక్కనే నిలబడిన చాహల్, రెండు చేతులతో లవ్ సింబల్ పెట్టాడు. చాహల్ తనకు కాబోయే శ్రీమతిపై ఉన్న ప్రేమను ఒకే ఫొటోలో చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్ లో చాహల్, రాయల్ చాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరగబోయే మ్యాచ్ ల కోసం త్వరలోనే తన టీమ్ తో కలిసి చాహల్ బయలుదేరనున్నాడు. 

Yajuvendra Chahal
Dhanasri Varma
Instagram
  • Loading...

More Telugu News