Low Pressure: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మత్స్యకారులకు హెచ్చరికలు

Low pressure area has been formed in Bay of Bengal

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • రాగల 48 గంటల్లో వర్షాలు
  • అలజడిగా మారిన సముద్రం

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సముద్రంలో అలజడి ఉందని, అలలు మూడున్నర మీటర్ల ఎత్తుకు ఎగసిపడతాయని వివరించారు.

  • Loading...

More Telugu News