Allu Arjun: బన్నీ! నీ ట్వీట్ చూసి ఆనందంతో ఉప్పొంగిపోయా!: పూరీ జగన్నాథ్

puri react bunnys tweet

  • పూరీ పోడ్‌కాస్ట్‌లో చెబుతున్న విషయాలపై బన్నీ ప్రశంస
  • చాలా అద్భుతమని వ్యాఖ్య
  • గొప్ప ప్రశంస దక్కిందన్న పూరీ
  • ఈ రోజు రాత్రికి ఒక ఎక్‌ట్రా పెగ్ వేస్తానని వ్యాఖ్య

పోడ్‌కాస్ట్‌ల ద్వారా సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆడియో రూపంలో స్ఫూర్తివంతమైన విషయాలను చెబుతున్నారు. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారిలో మార్పు తెచ్చేలా ఇటీవల ఆయన ధైర్యం నింపేలా ఆడియో పోస్ట్ చేశారు. తాజాగా, స్త్రీల గొప్పదనాన్ని చెబుతూ, వారిని తక్కువ చేసి చూస్తోన్న వారి దృక్పథం మారేలా స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. తరతరాలుగా స్త్రీ జాతిపై సమాజంలో ఉన్న వైఖరిని వివరించి చెప్పారు. 

వీటిని విన్న సినీ హీరో అల్లు అర్జున్ ఆయనను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. పూరీ జగన్నాథ్ పోడ్‌కాస్ట్‌లో చెబుతున్న మంచి విషయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు చాలా అద్భుతమని ఆయన పేర్కొన్నాడు. అవి తనకు చాలా బాగా నచ్చాయని చెప్పాడు. ఇటువంటి గొప్ప అంశాలను మరిన్నింటిని పూరీ వివరించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నాడు.

బన్నీ ట్వీట్‌పై పూరీ జగన్నాథ్ స్పందించారు. ఆయన ట్వీట్‌ను చదువుతూ ఆనందంతో ఉప్పొంగిపోయానని చెప్పారు. బన్నీలాంటి వ్యక్తి నుంచి ఇంత గొప్ప ప్రశంస అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పాడు. ఈ రోజు రాత్రికి ఒక ఎక్‌ట్రా పెగ్ వేస్తానని చెప్పారు.

Allu Arjun
Puri Jagannadh
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News