Sushant Singh Rajput: సుశాంత్ మరణం నేపథ్యంలో 9 పేజీల లేఖ విడుదల చేసిన కుటుంబ సభ్యులు

Sushant family wrote nine pages letter

  • పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే సుశాంత్ మరణంం అంటూ ఆరోపణలు
  • తమ కుటుంబంలో దృఢమైన బంధాలు ఉన్నాయని వెల్లడి
  • తల్లి లేని లోటుతెలియకుండా సుశాంత్ ను పెంచినట్టు వివరణ

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం, తదనంతరం జరుగుతున్న పరిణామాలు నానాటికీ ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా సుశాంత్ కుటుంబం 9 పేజీల సుదీర్ఘ లేఖ విడుదల చేసింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే సుశాంత్ మరణం సంభవించిందని ఈ లేఖలో ఆరోపించారు. అతడికి ముప్పు ఉందని తాము ఎప్పుడో చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. ఓ కుటుంబంగా తమ మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయని, పిల్లలు తమ కెరీర్లలో ఎదిగేందుకు గ్రామీణ వాతావరణం నుంచి నగరానికి వచ్చామని వివరించారు.

తల్లి మరణానంతరం ఆమె లేని లోటు తెలియకుండా సుశాంత్ ను పెంచామని, ఆమె ఆశయాలకు అనుగుణంగా సుశాంత్ ను తీర్చిదిద్దామని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, పదేళ్లపాటు తన కలల సామ్రాజ్యంలో విహరించిన అతడికి జరగరాని దారుణం జరిగిపోయిందని తెలిపారు. అయితే ఇది ఆత్మహత్య అని, ఇలాంటివి సాధారణమేనని పోలీసులు తమతో అన్నారని ఆరోపించారు. తాము ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే సుశాంత్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

Sushant Singh Rajput
Murder
Family
Letter
Bollywood
  • Loading...

More Telugu News