Harsha Kumar: జగన్ మోసగాడు.. దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి: హర్షకుమార్ సవాల్

Go to election Harsha Kumar dares Jagan
  • దళితులపై దాడి జరుగుతుంటే పట్టనట్టు వ్యవహరిస్తున్నారు
  • అమరావతే రాజధాని అని చెప్పి మోసం చేశారు
  • ఎన్నికల్లో గెలిస్తే రాజధానిని మార్చుకోండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక పచ్చి మోసగాడంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతుంటే జగన్ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అమరావతే రాజధానిగా ఉంటుందని, తాను కూడా అక్కడే ఇల్లు కట్టుకున్నానని ఎన్నికలకు ముందు జగన్ ప్రచారం చేసుకున్నారని... ఎన్నికల తర్వాత మోసం చేశారని అన్నారు. దళితుల విషయంలో కూడా మోసం చేస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు.

జగన్ కు సిగ్గు, దమ్ము ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని... ఎన్నికల్లో మెజార్టీ వస్తే అమరావతిని మార్చుకోవచ్చని సవాల్ విసిరారు. విజయవాడలో ప్రైవేట్ కోవిడ్ సెంటర్లో జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుతూ... లక్షల రూపాయలు పెట్టి ట్రీట్మెంట్ పొందుతున్న వారు చనిపోతే రూ. 50 లక్షల పరిహారం ప్రకటించారని... ఎస్సై కొడితే ప్రాణాలు కోల్పోయిన కిరణ్ కు రూ. 10 లక్షలు ముష్టి వేస్తావా? అని జగన్ పై మండిపడ్దారు.
Harsha Kumar
Jagan
YSRCP
Amaravati

More Telugu News